Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక నీ ఇంటర్వ్యూలు ఆపెయ్.. ఆదిపురుష్ రచయిత వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్

Hanuman is NOT God Adipurush writer Manoj Muntashir SLAMMED for his controversial remark
Advertisement
  • హనుమంతుడు దేవుడు కాదని, ఆయనొక భక్తుడన్న రచయిత
  • ఆయన భక్తిలోని శక్తి కారణంగానే భగవంతుడిని చేశామని వ్యాఖ్య
  • రచయిత వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం
Advertisement
ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా చేసిన వ్యాఖ్యలు కొందరి ఆగ్రహానికి గురయ్యాయి. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... హనుమంతుడు దేవుడు కాదని, ఆయనొక భక్తుడు అన్నారు. ఆయన భక్తిలోని శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిగా చేశామన్నారు. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురి చేశాయి. అసలు నీవు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా ట్రోల్స్ పై శుక్లా మాట్లాడుతూ... ఆదిపురుష్ ను అణగదొక్కేందుకు రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు. మీరు ఈ సినిమాను చూస్తే ఎలాంటి ఫిర్యాదులు మీ నుండి రావని వ్యాఖ్యానించారు. హనుమంతుడి పాత్రపై మీకు స్పష్టత వస్తుందన్నారు. రాముడిలా తత్వవేత్త కాదని, కానీ హనుమంతుడు తెలివైనవాడు, బలవంతుడన్నారు. కానీ అతను మాట్లాడినప్పుడు, చిన్న పిల్లలలా మాట్లాడుతాడన్నారు.
Advertisement
Advertisement
adipurush
hanuman

More Telugu News